Skip to main content

మోడెర్నా సంస్థ అభివృద్ధి చేస్తోన్న కరోనా వ్యాక్సిన్ పేరు?

అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మోడెర్నా ఎంఆర్‌ఎన్‌ఏ-1273 పేరిట కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
Current Affairs
ఈ టీకా 94.5 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలోని డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డు మూడోదశ పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని మోడెర్నా నవంబర్ 16న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో టీకా వినియోగం కోసం అనుమతులు తీసుకోనున్నట్లు తెలిపింది.

మూడో దశ ప్రయోగాల్లో కోవాగ్జిన్...
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా కోవాగ్జిన్’ మూడో దశ ప్రయోగాల్లోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా నవంబర్ 16న తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా బయోసేఫ్టీ లెవల్3 (బీఎస్‌ఎల్3) ఉత్పత్తి సదుపాయం ఉన్న ఏకైక సంస్థ భారత్ బయోటెక్ అని గుర్తుచేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఎంఆర్‌ఎన్‌ఏ-1273 పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి
ఎప్పుడు : నవంబర్ 16
ఎవరు : అమెరికాలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ మోడెర్నా
ఎందుకు : కరోనా వైరస్‌పై పోరాటానికి
Published date : 17 Nov 2020 05:24PM

Photo Stories