మోడెర్నా సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా పేరు?
Sakshi Education
కోవిడ్-19 వైరస్ ను ఎదుర్కొనేందుకు అమెరికాకి చెందిన మోడెర్నా సంస్థ <b>‘‘ఎంఆర్ఎన్ఏ-1273’’</b> అనే టీకాను అభివృద్ధి చేసింది.
ఈ టీకా అత్యవసర వినియోగ అనుమతి(ఈయూఏ) ఇచ్చేందుకు కార్యాచరణను ముమ్మరం చేసినట్లు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ) కమిషనర్ స్టీఫెన్ హన్ డిసెంబర్ 18న తెలిపారు. దీంతో అమెరికాలో ఫైజర్ టీకా తర్వాత అందుబాటులోకి రానున్న రెండో కరోనా టీకాగా మోడెర్నా వ్యాక్సిన్ రికార్డుకెక్కనుంది.
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీ సంస్థ బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘‘బీఎన్‌టీ162బీ2(BNT162b2)’’ కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఎఫ్‌డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
Published date : 19 Dec 2020 07:12PM