మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
Sakshi Education
2017-18లో 4,89,673 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తొలి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది.
3,82,364 హెక్టార్లలో మొక్కలు నాటిన ఒడిశా రెండో స్థానంలో నిలిచింది. మొక్కల పెంపకానికి సంబంధించిన గణాంకాలను ఫిబ్రవరి 10న కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో వెల్లడించారు. ఈ గణాంకాల ప్రకారం 2016-17లో 4,38,059 హెక్టార్లలో, 2015-16లో 2,36,598 హెక్టార్లలో మొక్కలు నాటడం ద్వారా జాతీయస్థాయిలో ఎక్కువ మొక్కలు నాటిన రాష్ట్రంగా తెలంగాణ తొలి స్థానాన్ని సాధించింది. ఇదిలా ఉంటే 2018-19 సంవత్సరానికి గాను ఒడిశాకు 2,82,755 హెక్టార్లలో, తెలంగాణకు 2,76,870 హెక్టార్లలో మొక్కలు నాటాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ : దేశంలో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మొక్కల పెంపకంలో తెలంగాణకు తొలి ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్
ఎక్కడ : దేశంలో
Published date : 12 Feb 2020 05:41PM