మొజాంబిక్ లో కెన్నెత్ తూఫాన్
Sakshi Education
ఆఫ్రికా దేశమైన మొజాంబిక్‌లో ఏప్రిల్ 26న కెన్నెత్ తూఫాన్ సంభవించింది.
తూఫాన్ కారణంగా భారీ వర్షాలు పడటంతోపాటుసుమారు 220 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.2019, మార్చిలో వచ్చిన ఇదియా తుపాన్ వల్ల వందలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మొజాంబిక్, మాల్వాయి, జింబాబ్వేలో సుమారు 900 మంది చనిపోయారు. సుమారు 30 లక్షల మంది నిరాశ్ర యులయ్యారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెన్నెత్ తూఫాన్
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : మొజాంబిక్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెన్నెత్ తూఫాన్
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : మొజాంబిక్
Published date : 27 Apr 2019 05:42PM