Skip to main content

మొబైల్‌ యాప్‌లో బ‌డ్జెట్ వివ‌రాలు

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ 2021-22 ఆర్థిక ఏడాది వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. చరిత్రలోనే మొదటిసారిగా ఈసారి బడ్జెట్ కాగితరహితంగా వ‌చ్చింది.

Current Affairsఈ నేపథ్యంలో బడ్జెట్ వివరాలను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. " చరిత్రలో తొలిసారి ఈ బడ్జెట్‌ను డిజిటల్ ఫార్మాట్‌లో సమర్పిస్తున్నాం. దానికి సంబంధించిన ప్రతులు indiabudget.gov.in పోర్టల్‌ లేక యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి’ అని బిర్లా తెలిపారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకునే వీలుకూడా ఉంది. కరోనా కారణంగా ఈ సమావేశాలు కాగితరహితంగా మారడంతో..సభ్యులకు కూడా బడ్జెట్ సాఫ్ట్ కాపీలు అందించారు. ఆర్థిక మంత్రి సంప్రదాయ బాహీఖాతాను వదిలి దేశీయ ట్యాబ్‌తో పార్లమెంట్‌కు బయల్దేరారు.

Published date : 01 Feb 2021 11:57AM

Photo Stories