మనుషులకి సోకిన కొత్త బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్?
Sakshi Education
ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ వైరస్‌లో కొత్త స్ట్రెయిన్ మనుషులకి సోకింది.
చైనాలో ఈ వైరస్ తొలిసారిగా ఒక వ్యక్తికి సోకిందని అక్కడి జూన్ 1న ప్రభుత్వం నిర్ధారించింది. తూర్పు జియాంగ్సుప్రావిన్స్‌లో 41 ఏళ్ల వ్యక్తికి మే 28న బర్డ్ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్10ఎన్3’ రకం సోకినట్టుగా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. అయితే అతనికి వైరస్ ఎలా సోకింది? ఎక్కడ్నుంచి వచ్చింది వంటివేవీ వెల్లడించలేదు. హెచ్10ఎన్3 వైరస్ మనుషులకి సోకడం ప్రపంచంలో ఇదే తొలిసారి.పక్షుల నుంచి మనుషులకి ఈ వైరస్ చాలా అరుదుగా సోకుతుందని వెల్లడించిన చైనా ఆరోగ్య శాఖ వైరస్‌తో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని పేర్కొంది. బర్డ్ ఫ్లూ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది.
ఇప్పటివరకు కోళ్లకు, ఇతర పక్షులకు ప్రాణాంతకంగా మారిన ‘హెచ్5ఎన్8’ రకం మనుషులకి సోకే ప్రమాదం చాలా తక్కువ. కోళ్ల ఫామ్స్‌లో పని చేసే వారికి మాత్రమే ఈ వైరస్ ముప్పు ఉండేది. ఇప్పుడు ‘హెచ్10ఎన్3’ రకం వైరస్ సోకడం ఆందోళన రేపుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తొలిసారిగాపక్షుల నుంచిమనుషులకి సోకిన కొత్త బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్?
ఎప్పుడు : జూన్ 1
ఎవరు : బర్డ్ ఫ్లూ వైరస్‌లోని ‘హెచ్10ఎన్3’ రకం
ఎక్కడ : తూర్పు జియాంగ్సుప్రావిన్స్, చైనా

Published date : 04 Jun 2021 12:24PM