Skip to main content

మన్మోహన్‌కు ‘పీవీ’ అవార్డ్

2018 సంవత్సరానికి గానూ పీవీ నరసింహరావు జీవన సాఫల్య పురస్కారాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫిబ్రవరి 27వ తేదీన ఢిల్లీలోని తీన్‌మూర్తి భవన్‌లో ప్రదానం చేయనున్నారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరుగనుందని ఇండియా నెక్ట్స్ సంస్థ కన్వీనర్ సూర్యప్రకాశ్ ఫిబ్రవరి 22న తెలిపారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య అధ్యక్షతన లోక్‌సభ సెక్రటేరియట్ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, ఐపీఎస్ అధికారి కార్తికేయన్, లోక్‌సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్ర మూర్తి, పీఐబీ మాజీ చీఫ్ నరేంద్ర సభ్యులుగా ఉన్న జ్యూరీ మన్మోహన్ సింగ్‌ను ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి:
మన్మోహన్‌కు పీవీ నరసింహరావు జీవన సాఫల్య పురస్కారం
ఎవరు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 23 Feb 2019 06:03PM

Photo Stories