Skip to main content

మణిపూర్ హైకోర్టు సీజేగా నియామకం కానున్న న్యాయమూర్తి?

మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ను నియమించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Current Affairs ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని కొలీజియం డిసెంబర్ 16న ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ ప్రస్తుతం పంజాబ్-హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.

జస్టిస్ సంజయ్ నేపథ్యం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (1969-1982)గా పనిచేసిన జస్టిస్ పి.రామచంద్రారెడ్డి, పి.పద్మావతమ్మ దంపతులకు జస్టిస్ సంజయ్ కుమార్ 14 ఆగస్టు 1963న జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి 1988లో న్యాయ పట్టా అందుకున్నారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఆగస్టు 8, 2008న అదనపు న్యాయమూర్తిగా, జనవరి 20, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం జస్టిస్ సంజయ్ కుమార్‌ను తెలంగాణకు కేటాయించారు. 2019 అక్టోబర్ 14న పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
Published date : 26 Jan 2021 07:52PM

Photo Stories