మంగోలియాలో బుద్ధుని విగ్రహావిష్కరణ
Sakshi Education
మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో ఏర్పాటుచేసిన బుద్ధుని బంగారు విగ్రహాన్ని మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్‌మాగీన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
ఢిల్లీలో సెప్టెంబర్ 20న నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉలాన్‌బాటర్‌లోని గందన్ ఆరామంలో ఈ బంగారు బుద్ధ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. బట్టూగ్లా 5 రోజుల భారత్ నిమిత్తం న్యూఢిల్లీ వచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుద్ధుని బంగారు విగ్రహావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్‌మాగీన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గందన్ ఆరామం, ఉలాన్‌బాటర్, మంగోలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుద్ధుని బంగారు విగ్రహావిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 20
ఎవరు : మంగోలియా అధ్యక్షుడు ఖల్ట్‌మాగీన్ బట్టూగ్లాతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : గందన్ ఆరామం, ఉలాన్‌బాటర్, మంగోలియా
Published date : 21 Sep 2019 06:39PM