మలయాళ మనోరమ సదస్సులో మోదీ
Sakshi Education
కేరళలోని కోచీలో ఆగస్టు 30న నిర్వహించిన మలయాళ మనోరమ సదస్సును ఉద్దేశించి న్యూఢిల్లీ నుంచి వీడియో లింక్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
నిర్మాణాత్మక విమర్శలను తానెప్పుడూ స్వాగతిస్తానని, ప్రజా జీవితంలో భిన్నాప్రాయాలకు తావుండాలని, అందరూ తమ తమ భావాలను వ్యక్తం చేసేందుకు అవకాశం ఉండాలని ఈ సందర్భంగా మోదీ ఉద్ఘాటించారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా... సమాజంలో అంశాలపై చర్చ నిరంతరం సాగుతూనే ఉండాలని పేర్కొన్నారు.
Published date : 31 Aug 2019 05:33PM