మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మిస్తున్నారు?
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
గోదావరి జలాలు కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లోకి అడుగుపెట్టాయి. ప్రాజెక్టు అధికారులు ఆగస్టు 22న సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ పంపుహౌస్ వద్ద ప్రత్యక పూజలు నిర్వహించి మోటార్లను ప్రారంభించారు. పంపుల నుంచి వెళ్లిన గోదావరి నీళ్లు.. మల్లన్నసాగర్‌లోకి అడుగుపెట్టాయి. దీంతో ట్రయల్‌రన్ విజయవంతం అయిందని అధికారులు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి అనుసంధానంగా సిద్ధిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.
ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు నియమితులయ్యారు. ఆరున్నర సంవత్సరాల పాటు అధ్యక్షునిగా కొనసాగిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో అ«ధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిలో హరీశ్‌రావును నియమించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది.

Published date : 23 Aug 2021 05:49PM