మల్కాపూర్‌లో ఐఓసీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు
Sakshi Education
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) రూ.3,800 కోట్ల పెట్టుబడులతో చేపడుతున్న పారదీప్ - హైదరాబాద్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) పైప్‌లైన్ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది.
ఈ పైప్‌లైన్‌కు అనుసంధానిస్తూ కొత్తగా యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌లో భారీ డీఈఎఫ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది. రూ.611 కోట్ల పెట్టుబడులతో సుమారు 70 ఎకరాల్లో దీని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఏడాదిన్నరలో అందుబాటులోకి వస్తుందని ఐఓసీఎల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ (ఈడీ), ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హెడ్ శ్రవణ్ ఎస్ రావు మార్చి 11న తెలిపారు. ఎల్‌పీజీ, పెట్రోల్, డీజిల్ మార్కెట్లో 39 శాతం మార్కెట్ వాటాతో ఐఓసీఎల్ మార్కెట్ లీడర్‌గా ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) టెర్మినల్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)
ఎక్కడ : మల్కాపూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ (డీఈఎఫ్) టెర్మినల్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 11
ఎవరు : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్)
ఎక్కడ : మల్కాపూర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ
Published date : 13 Mar 2020 05:39PM