Skip to main content

మలేషియలో చివరి సుమత్రన్ ఖడ్గమృగం మృతి

అత్యంత అరుదైన సుమత్రన్ ఖడ్గమృగం (రైనో) మలేషియాలో అంతరించిపోయింది.
Current Affairsబోర్నియో ద్వీపంలోని సబాహ్ రాష్ట్రంలో ఉన్న చిట్టచివరి ఖడ్గమృగం ‘ఇమాన్’ క్యాన్సర్‌తో బాధపడుతూ నవంబర్ 23న మరణించింది. 25ఏళ్ల వయసున్న ఈ ఆడ ఖడ్గమృగం మూత్రాశయ ప్రాంతంలో క్యాన్సర్ కణతులు పెరిగిపోవడంతో మరణించిందని అక్కడి అధికారులు వివరించారు. మలేషియాలోని చివరి మగ సుమత్రన్ ఖడ్గమృగం 2019, మేలో చనిపోయింది.

ఖడ్గమృగం జాతుల్లో అత్యంత చిన్నది
ఫ్రపంచంలో ఖడ్గమృగాల జాతులు ప్రస్తుతం ఐదు ఉన్నాయి. వీటిలో మూడు ఆసియాలో, రెండు ఆఫ్రికాలో ఉన్నాయి. ఆసియాలోని జాతుల్లో సుమత్రన్ ఖడ్గమృగం ఒకటి. ఇప్పుడున్న జాతుల్లో అత్యంత చిన్నది ఇదే. సుమారు 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఉన్నితో కూడిన ఖడ్గమృగ జాతికి, సుమత్రన్ రైనోకు దగ్గరి పోలికలు ఉంటాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
సుమత్రన్ ఖడ్గమృగం (రైనో) ఇమాన్ మృతి
ఎప్పుడు : నవంబర్ 24
ఎక్కడ : బోర్నియో ద్వీపం, మలేషియా
ఎందుకు : క్యాన్సర్ కారణంగా
Published date : 25 Nov 2019 05:56PM

Photo Stories