Skip to main content

మలేసియా ఓపెన్ విజేతగా లిన్ డాన్

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 750 టోర్నీ మలేసియా ఓపెన్ విజేతగా చైనాకి చెందిన లిన్ డాన్ నిలిచాడు.
మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏప్రిల్ 7న జరిగిన ఈ టోర్ని ఫైనల్లో లిన్ డాన్ తన జూనియర్ చెన్ లాంగ్ (చైనా)పై 9-21, 21-7, 21-11 స్కోరుతో విజయం సాధించాడు.

మరోవైపు మహిళల సింగిల్స్ టైటిల్‌ను వరల్డ్ నంబర్ వన్ తై జు యింగ్ (తైపీ) వరుసగా మూడో సారి గెలుచుకుంది. ఫైనల్లో తై జు 21-16, 21-19తో అకానె యామగుచి (జపాన్)ను ఓడించింది. అధేవిధంగా పురుషుల డబుల్స్‌లో లి జున్ హు-లి యుచెన్ (చైనా), మహిళల డబుల్స్‌లో చెన్ కింగ్‌చెన్-జియా యిఫాన్ (చైనా), మిక్స్‌డ్ డబుల్స్‌లో జెంగ్ సివే- హువాంగ్ (చైనా) జోడీలు విజేతలుగా నిలిచాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మలేసియా ఓపెన్ విజేత
ఎప్పుడు : ఏప్రిల్ 7
ఎవరు : లిన్ డాన్
ఎక్కడ : కౌలాలంపూర్, మలేసియా
Published date : 08 Apr 2019 05:00PM

Photo Stories