మలేషియా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
Sakshi Education
మలేషియా నూతన ప్రధానమంత్రిగా ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్(61) నియమితులయ్యారు.
ఇప్పటివరకు మలేషియా ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన ఆగస్టు 21న మలేషియా తొమ్మిదో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటిదాకా ప్రధానిగా పనిచేసిన ముహియిద్దిన్ యాసిన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధికార కూటమిలో అసంతృప్త ఎంపీల తిరుగుబాటు వల్ల కేవలం యాసిన్ 18 నెలల్లోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మలేషియా రాజుగా Üుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేషియా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్(61)
ఎందుకు : ముహియిద్దిన్ యాసిన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో...
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేషియా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి?
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : ఇస్మాయిల్ సబ్రీ యాకోబ్(61)
ఎందుకు : ముహియిద్దిన్ యాసిన్ ఇటీవల తన పదవికి రాజీనామా చేయడంతో...
Published date : 21 Aug 2021 05:59PM