మలావీలో మలేరియా టీకా ప్రారంభం
Sakshi Education
ఆఫ్రికా దేశమైన మలావీలో మలేరియా వ్యాక్సిన్ (టీకా)వాడకాన్ని ఏప్రిల్ 24న ఆ దేశ ప్రభుత్వం ప్రారంభించింది.
దీంతో ప్రపంచంలో మొట్టమొదటిగా మలేరియా వ్యాక్సిన్‌ను వాడిన దేశంగా మలావీ నిలిచింది. ఈ టీకాకు ‘ఆర్‌టీఎస్‌ఎస్’గా నామకరణం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) స్వాగతించింది. ఘనా, కెన్యాల్లో త్వరలోనే ఈ వ్యాక్సిన్ చిన్నారులకు అందుబాటులో ఉంటుందని డబ్ల్యుహెచ్‌వో ప్రకటించింది. ఏటా ఆఫ్రికా దేశాల్లో రెండున్నర లక్షల మందికి పైగా చిన్నారులు మలేరియాతో ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 4,35,000 మంది పిల్లలు మలేరియా బారినపడుతున్నట్లు అంచనా. ప్రతి రెండునిముషాలకు ఓ చిన్నారి మలేరియాతో మృత్యువాత పడుతున్నట్లు డబ్ల్యుహెచ్‌వో వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేరియా వ్యాక్సిన్ (టీకా) వాడ కం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : మలావీ ప్రభుత్వం
ఎక్కడ : మలావీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : మలేరియా వ్యాక్సిన్ (టీకా) వాడ కం ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్ 2
ఎవరు : మలావీ ప్రభుత్వం
ఎక్కడ : మలావీ
Published date : 26 Apr 2019 06:59PM