మిస్ దివా యూనివర్స్ విజేతగా అడిలైన్
Sakshi Education
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఫిబ్రవరి 22న జరిగిన ‘లివా మిస్ దివా యూనివర్స్-2020’ పోటీల్లో మంగళూరుకు చెందిన అడిలైన్ క్యాస్టిలినో విజేతగా నిలిచారు.
మిస్ దివా సుప్రనేషనల్ కిరీటాన్ని జబల్‌పూర్‌కు చెందిన ఆవృతి చౌదరి గెలుచుకున్నారు. పుణేకు చెందిన నేహా జైస్వాల్ మిస్ దివా రన్నరప్‌గా నిలిచారు. 2020 ఏడాది జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున క్యాస్టిలినో ప్రాతినిథ్యం వహించనుండగా.. ఆవృతి మిస్ సుప్రనేషనల్ పోటీలకు భారత పోటీదారుగా వ్యవహరించనున్నారు. మిస్ దివా పోటీల్లో మాజీ మిస్ యూనివర్స్ లారా దత్తా, ఆంటోనియా పోర్లిడ్, ఆశాభట్, డిజైనర్లు శివన్ భటియా, నరేశ్ కుక్రేజా, నిఖిల్ మెహ్రా, నటులు యామీ గౌతం, ఆదిత్యరాయ్ కపూర్, అనిల్ కపూర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లివా మిస్ దివా యూనివర్స్-2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : అడిలైన్ క్యాస్టిలినో
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
క్విక్ రివ్యూ :
ఏమిటి : లివా మిస్ దివా యూనివర్స్-2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : అడిలైన్ క్యాస్టిలినో
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
Published date : 24 Feb 2020 06:06PM