Skip to main content

మిర్జాపూర్, సోన్‌భద్ర తాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో ఉన్న మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించే ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 22న వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
Current Affairs జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే రూ.5,555.38 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల ద్వారా 2024కల్లా 2,995 గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యం.

గృహ సముదాయం...
పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 23న ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014-19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : రూ.5,555.38 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలు, ఉత్తరప్రదేశ్
ఎందుకు : వింధ్యాచల్ ప్రాంతంలో ఉన్న మిర్జాపూర్, సోన్‌భద్ర జిల్లాలకు తాగునీటిని అందించేందుకు
Published date : 24 Nov 2020 06:34PM

Photo Stories