Skip to main content

మిలటరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ లో రాజ్‌నాథ్

దేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న నిర్వహించిన షాంఘై సహకార సంఘం(ఎస్‌సీవో) దేశాల తొలి మిలటరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. జీవ ఉగ్రవాదం(బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిముల ద్వారా ప్రజలను చంపడం లేదా అస్వస్థతకు గురి చేయడం) అసలైన ప్రమాదకారిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్లేగు వ్యాధి మాదిరిగా వ్యాపిస్తోందన్నారు. యుద్ధ క్షేత్రంలోని సైనికులు దీని బారిన పడకుండా ఎస్‌సీవో దేశాల సైనిక బలగాల వైద్య సర్వీసులు(ఏఎఫ్‌ఎంఎస్) ప్రభావశీల మార్గాలను అన్వేషించాలన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎస్‌సీవో దేశాల తొలి మిలటరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ లో
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : న్యూఢిల్లీ
ఎక్కడ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Published date : 13 Sep 2019 06:05PM

Photo Stories