మిలటరీ క్రీడల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
చైనాలోని వుహాన్‌లో జరుగుతున్న ప్రపంచ మిలటరీ క్రీడల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం లభించాయి.
అక్టోబర్ 24న జరిగిన జావెలిన్ త్రో పోటీల్లో భారత క్రీడాకారుడు శివ్‌పాల్ సింగ్ స్వర్ణం సాధించాడు. శివ్‌పాల్ జావెలిన్‌ను 83.33మీ దూరం విసిరి అగ్రస్థానంలో నిలిచాడు. క్రుకోవ్‌స్కీ (పోలాండ్-78.17మీ) రజతం, రణసింగే (శ్రీలంక-75.35మీ) కాంస్యం దక్కించుకున్నారు.
మరోవైపు 200మీ ఐటీ1 ఈవెంట్‌లో భారత పారా-అథ్లెట్ గుణశేఖరన్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అతను లక్ష్యాన్ని 24.31 సెకన్లలో చేరి అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికే దివ్యాంగ కేటగిరీ పురుషుల 100మీ, 400 మీ ఐటీ1 విభాగాల్లో గుణశేఖరన్ స్వర్ణాలు సాధించాడు. పురుషుల 25మీ ఫైర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో గుర్‌ప్రీత్ సింగ్(భారత్) కాంస్యం సాధించాడు. అతడు ఫైనల్లో 585 పాయింట్లు స్కోర్ చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ మిలటరీ క్రీడల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : శివ్‌పాల్ సింగ్, గుణశేఖరన్
ఎక్కడ : వుహాన్, చైనా

Published date : 25 Oct 2019 05:40PM