Skip to main content

మహిళలకు రూ. 17వేల కోట్ల రుణాలు

స్టాండప్ ఇండియా పథకం కింద రుణాలు పొందిన వారిలో దాదాపు 81 శాతం మంది మహిళలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
Current Affairsనాలుగేళ్ల వ్యవధిలో వారు రూ. 16,712 కోట్ల రుణాలు పొందినట్లు వివరించింది. ‘2020 ఫిబవ్రరి 17 నాటికి స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఖాతాదారుల్లో 81 శాతం మంది మహిళలు ఉన్నారు. 73,155 ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయి. మహిళలు సాధికారతతో మరింత మెరుగైన జీవితాన్ని సాగించేందుకు, వ్యాపారవేత్తలుగా తమ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ పథకం తోడ్పడింది’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.

2016 ఏప్రిల్ 5న ప్రారంభం..
ప్రతి బ్యాంకు శాఖ పరిధిలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు కొత్తగా సంస్థను ప్రారంభించేందుకు.. కనీసం ఒక్కరికైనా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా రుణాలిచ్చే ఉద్దేశంతో 2016 ఏప్రిల్ 5న స్టాండప్ ఇండియా స్కీమ్‌ను కేంద్రప్రభుత్వం ప్రారంభించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళలకు రూ. 16,712 కోట్ల రుణాలు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : కేంద్ర ఆర్థిక శాఖ
ఎక్కడ : స్టాండప్ ఇండియా పథకం కింద
Published date : 04 Mar 2020 05:36PM

Photo Stories