Skip to main content

మహిళల రక్షణకు బీ సేఫ్ యాప్ ఆవిష్కరణ

ఏపీ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న విజయవాడలో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు.
Current Affairsఈ సదస్సు సందర్భంగా మహిళలు, యువత రక్షణ కోసం ఉద్దేశించిన ‘బీ సేఫ్’ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆవిష్కరించారు. అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ... అత్యవసర ఫోన్ నంబర్లు 100, 181, 112, వాట్సాప్ నంబరు 9121211100పై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళామిత్ర, సైబర్‌మిత్ర ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బీ సేఫ్ యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : మహిళలు, యువత రక్షణ కోసం
Published date : 04 Dec 2019 05:33PM

Photo Stories