మహిళల నడకలో ప్రపంచ రికార్డు
Sakshi Education
మహిళల 50 కిలోమీటర్ల నడక విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.
చైనాలోని హువాంగ్‌షన్ పట్టణంలో మార్చి 9న జరిగిన చైనీస్ రేస్ వాక్ గ్రాండ్‌ప్రి మీట్‌లో చైనాకు చెందిన లియు హాంగ్ ఈ ఘనత సాధించింది. 50 కిలోమీటర్ల దూరాన్ని లియు హాంగ్ 3 గంటల 59 నిమిషాల 15 సెకన్లలో అధిగమించి విజేతగా నిలిచింది. 4 గంటల 4 నిమిషాల 36 సెకన్లతో ఇప్పటిదాకా లియాంగ్ రుయి (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును లియు హాంగ్ చేరిపేసింది. 50 కిలో మీటర్ల గమ్యాన్ని 4 గంటల్లోపు చేరిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 31 ఏళ్ల లియు హాంగ్ 2016 రియో ఒలింపిక్స్‌లో 20 కిలోమీటర్ల విభాగంలో... 2011, 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణ పతకాలు నెగ్గింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల 50 కిలోమీటర్ల నడకలో ప్రపంచ రికార్డు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : లియు హాంగ్
ఎక్కడ : హువాంగ్‌షన్, చైనా
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల 50 కిలోమీటర్ల నడకలో ప్రపంచ రికార్డు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : లియు హాంగ్
ఎక్కడ : హువాంగ్‌షన్, చైనా
Published date : 11 Mar 2019 04:58PM