Skip to main content

మహిళల మారథాన్‌లో ప్రపంచ రికార్డు

మహిళల మారథాన్‌లో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.
అమెరికాలోని షికాగోలో అక్టోబర్ 13న జరిగిన షికాగో మారథాన్‌లో కెన్యాకు చెందిన 25 ఏళ్ల బ్రిగిడ్ కోస్గె 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 14 నిమిషాల 04 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచింది. 16 ఏళ్లుగా పౌలా రాడ్‌క్లిఫ్ (బ్రిటన్-2గం:15.25 సెకన్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోస్గె తిరగ రాసింది.

కిప్‌చెగో రికార్డు
మరోవైపు 42.195 కిలోమీటర్ల పురుషుల మారథాన్ రేసును 2 గంటల్లోపు పూర్తి చేసిన తొలి అథ్లెట్‌గా కెన్యా రన్నర్, రియో ఒలింపిక్స్ చాంపియన్ ఇలియుడ్ కిప్‌చెగో గుర్తింపు పొందాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 12న జరిగిన మారథాన్ రేసులో 34 ఏళ్ల కిప్‌చెగో గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో గమ్యానికి చేరాడు. అయితే ఇది అధికారికంగా గుర్తింపు పొందిన మారథాన్ రేసు కాకపోవడంతో కిప్‌చెగో ఘనత రికార్డు పుస్తకాల్లో చేరడం లేదు. ప్రస్తుత మారథాన్ ప్రపంచ రికార్డు కిప్‌చెగో పేరిటే ఉంది. 2018 ఏడాది బెర్లిన్ మారథాన్‌లో కిప్‌చెగో 2 గంటల 1 నిమిషం 39 సెకన్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహిళల మారథాన్‌లో ప్రపంచ రికార్డు
ఎప్పుడు : అక్టోబర్ 13
ఎవరు : బ్రిగిడ్ కోస్గె
ఎక్కడ : షికాగో, అమెరికా
Published date : 14 Oct 2019 05:53PM

Photo Stories