Skip to main content

మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన వాయిదా

భారత మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 25 నుంచి ఇంగ్లండ్‌ మహిళల జట్టుతో నాలుగు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ల్లో భారత్‌ తలపడాల్సి ఉంది.
Current Affairs

కరోనా వైరస్‌ నేపథ్యంలో తమ దేశంలో అన్ని స్థాయిల్లోని ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను జూలై 1 వరకు వాయిదా వేస్తున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఏప్రిల్ 24న ప్రకటించింది. దీంతో అక్కడ భారత పర్యటన వాయిదా పడింది. దేశవాళీ క్రికెట్‌ సీజన్‌లోనూ తొమ్మిది రౌండ్ల మ్యాచ్‌ల్ని కోల్పోతున్నట్లు ఈసీబీ తెలిపింది.


మరో రెండు నెలలు శశాంక్‌ కొనసాగింపు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్‌ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మహిళల క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటన వాయిదా
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)
ఎందుకు :కరోనా వైరస్‌ కార‌ణంగా
Published date : 25 Apr 2020 06:13PM

Photo Stories