Skip to main content

మహిళల కోసం ఖేలో ఇండియా హాకీ లీగ్

దేశంలో యువ మహిళా హాకీ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ‘అండర్-21 ఖేలో ఇండియా మహిళా హాకీ లీగ్’ను ఏర్పాటు చేసినట్లు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్), హాకీ ఇండియా (హెచ్‌ఐ) మార్చి 5న ప్రకటించాయి.
Current Affairsమూడు వేదికల్లో మూడు దశల్లో 2020, మార్చి నుంచి నవంబర్ వరకు ఈ లీగ్‌ను నిర్వహించనున్నట్లు హెచ్‌ఐ తెలిపింది. తొలి సీజన్‌లో మొత్తం 14 జట్లు ఈ లీగ్‌లో తలపడనున్నాయి. పూల్ ‘ఎ’, పూల్ ‘బి’లో వీటిని ఏడేసి జట్ల చొప్పున విభజించారు. రెండో దశలో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో పోటీలను నిర్వహిస్తారు. మూడో దశలో వర్గీకరణ మ్యాచ్‌లతో పాటు ఫైనల్ నిర్వహిస్తారు.

తొలి దశ పోటీలు: న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో 2020 మార్చి 23 నుంచి 29 వరకు తొలి దశ పోటీలు జరుగుతాయి.
 
రెండో అంచె పోటీలు: బెంగళూరులోని ‘సాయ్’సెంటర్‌లో 2020, జూలై 13 నుంచి 19 వరకు రెండో అంచె పోటీలు జరుగుతాయి.

మూడో దశ పోటీలు: చివరి దశ పోటీలను భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో 2020, నవంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అండర్-21 ఖేలో ఇండియా మహిళా హాకీ లీగ్ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 5
ఎవరు : భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)
ఎందుకు : దేశంలో యువ మహిళా హాకీ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు
Published date : 07 Mar 2020 05:52PM

Photo Stories