మహిళల హాకీ సిరీస్ విజేతగా భారత్
Sakshi Education
మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ విజేతగా భారత్ అవతరించింది. జపాన్‌లోని హిరోషిమాలో జూన్ 23న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-1 గోల్స్ తేడాతో ఆతిథ్య జపాన్‌పై విజయం సాధించింది.
ఈ టోర్నీ ఫైనల్లో ప్రవేశించడం ద్వారా ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ భారత్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ తుది రౌండ్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో భారత జట్టుకు రాణి రాంపాల్ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఈ టోర్నిలో మూడో స్థానానికి జరిగిన పోరులో చిలీ షూటవుట్‌లో 3-1తో రష్యాను ఓడించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ విజేత
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : భారత్
ఎక్కడ : హిరోషిమా, జపాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీ విజేత
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : భారత్
ఎక్కడ : హిరోషిమా, జపాన్
Published date : 24 Jun 2019 06:37PM