Skip to main content

మహిళల భద్రతకు అభయ్ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ‘అభయ్’ పేరుతో వాహనాలు ఏర్పాటు చేశారు.
Current Affairsఈ వాహనాలను ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ డిసెంబర్ 4న ఒంగోలులో ప్రారంభించారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు జిల్లాలో ఎనిమిది వాహనాలు (నాలుగు చక్రాలు) మహిళల రక్షణకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు వాహనాలను నమ్మలేని పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో డయల్-100కు ఫోన్ చేసి మహిళలు అభయ్ వాహనాల సేవలను వినియోగించుకోవచ్చు. వాహనంలో డ్రైవర్‌తో పాటు ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. జిల్లా వ్యాప్తంగా అత్యవసరంగా సేవలందించేందుకు 70 ద్విచక్ర వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వరుస దుర్ఘటనల నేపథ్యంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

లూథియానాలోనూ...
పంజాబ్‌లోని లూథియానా పోలీసులు కూడా రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, యువతుల కోసం డిసెంబర్ 1 నుంచి నుంచి కొత్త సర్వీసు ప్రారంభించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అభయ్ పేరుతో వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎవరు : ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
ఎక్కడ : ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఎందుకు : రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు
Published date : 05 Dec 2019 05:44PM

Photo Stories