Skip to main content

మహావీరచక్ర పురస్కారం-2021 విజేత?

భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబును మహావీరచక్ర పురస్కారం వరించింది.
Current Affairs 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. యుద్ధ సమయాల్లో చూపే సాహసం, శౌర్యం, తెగువకు ప్రతీకగా ఈ అవార్డులు ఇస్తారు. మిలటరీ గ్యాలంటరీ అవార్డుల్లో ‘మహా వీర చక్ర’రెండో అత్యున్నత పురస్కారం.

2019 కల్నల్‌గా...
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కేంద్రం సూర్యాపేటకు చెందిన బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల దంపతులకు సంతోష్‌బాబు 1983, ఫిబ్రవరి 13న జన్మించారు. నేషనల్ ఢిపెన్‌‌స అకాడమీ పుణేలో డిగ్రీ పూర్తి చేశారు. 2004 డిసెంబర్‌లో జమ్మూలో తొలిసారి మిలటరీ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 డిసెంబర్‌లో కల్నల్‌గా పదోన్నతి పొందారు. బిహార్ 16వ రెజిమెంట్ కామాండింగ్ అధికారిగా ఉన్న సమయంలో.. గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో 2020, జూన్ 15న వీరమరణం పొందారు. కొంతకాలం కాంగో దేశంలో కూడా కల్నల్ సంతోష్‌బాబు విధులు నిర్వహించాడు.

సైనిక పురస్కారాలు-2021 జాబితా
మహావీర్‌చక్ర: బి.సంతోష్ బాబు (కల్నల్ )
కీర్తిచక్ర : సంజీవ్‌కుమార్ (సుబేదార్), పింటూకుమార్ (సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్), శ్యాంనారాయణ్ సింగ్ యాదవ్ (సీఆర్‌పీఎఫ్ హెడ్‌కానిస్టేబుల్), వినోదకుమార్ (సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్), రాహుల్ మాథుర్ (సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్)
వీర్‌చక్ర: నుదూరామ్ సోరెన్ (నాయబ్ సుబేదార్), కె.పళని (హవల్దార్), తేజీందర్‌సింగ్ (హవల్దార్), దీపక్‌సింగ్ (నాయక్), గురుతేజ్ సింగ్ (సిపాయి)
శౌర్యచక్ర: అనూజ్ సూద్ (మేజర్), ప్రణబ్‌జ్యోతి దాస్ (రైఫిల్‌మ్యాన్), సోనమ్ శెరింగ్ తమాంగ్ (పారాట్రూపర్), అర్షద్ ఖాన్ (ఇన్‌స్పెక్టర్ - జమ్మూకశ్మీర్), ముస్తాఫా బారా (ఎస్‌జీసీటీ -జమ్మూకశ్మీర్), నజీర్ అహ్మద్ కోలీ (ఎస్‌జీసీటీ - జమ్మూకశ్మీర్), బిలాల్ అహ్మద్ మాగ్రే (స్పెషల్ పోలీసు ఆఫీసర్- జమ్మూకశ్మీర్)

క్విక్ రివ్యూ :
ఏమిటి : మహావీరచక్ర పురస్కారం-2021 విజేత
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : కల్నల్ సంతోష్‌బాబు
ఎందుకు : యుద్ధ సమయంలో అసాధారణ సాహసం, శౌర్యం, తెగువ చూపినందున
Published date : 26 Jan 2021 07:51PM

Photo Stories