Skip to main content

మహాత్మాగాంధీ కళ్లద్దాలకు రూ. 2.55 కోట్లు

మహాత్మాగాంధీ ధరించాడని భావిస్తున్న బంగారుపూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.
Current Affairsఈస్ట్‌ బ్రిస్టల్‌ ఆక్షన్స్‌ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్ల (రూపాయలు 2.55 కోట్లు)కు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్‌ పెట్రోలియంకు పనిచేస్తున్న సమయంలో, 1910– 1930 మధ్యకాలంలో బ్రిటన్‌ దేశస్తుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు.

బ్రిటన్ లోని సౌత్‌ గ్లూసెస్టర్‌షైర్‌లో నివసించే వ్యక్తి 50 ఏళ్లుగా తమ ఇంట్లో ఉన్న ఈ కళ్లజోడును వేలం వేయాల్సిందిగా కోరారు. 10 నుంచి 15 వేల పౌండ్లు పలుకుతాయని భావించారు. అయితే ఏకంగా రెండు లక్షల అరవై వేల పౌండ్లకు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నాడు. భారత్, ఖతార్, అమెరికా, రష్యా, కెనడాల నుంచి పలువురు వేలం పాటలో పాల్గొన్నారు.
Published date : 24 Aug 2020 08:04PM

Photo Stories