Skip to main content

మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే పథకం

మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర రైతులకు తీపి కబురు అందించింది.
Current Affairsరూ. 2 లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే డిసెంబర్ 21న ప్రకటించారు. 2019 సెప్టెంబర్ 30 వరకూ ఉన్న రుణాలు మాఫీ చేయనున్నట్లు చెప్పారు. ఈ రుణమాఫీకి ‘మహాత్మా జ్యోతిరావ్ ఫూలే రైతు రుణ మాఫీ’ పథకంగా పేరుపెట్టారు. దీని వల్ల రూ. 40 వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2017లో అప్పటి బీజేపీ-శివసేన ప్రభుత్వం 50 లక్షల మంది రైతులకు చెందిన రూ. 19 వేల కోట్ల రుణాలను చెల్లించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావ్ ఫూలే రెతు రుణ మాఫీ పథకం
ఎప్పుడు : డిసెంబర్ 21
ఎవరు : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ఎందుకు : రూ. 2 లక్షల వరకూ ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు
Published date : 23 Dec 2019 05:41PM

Photo Stories