Skip to main content

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సీనియర్ నేత అజిత్‌పవార్ నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
Current Affairsశివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల అనంతరం డిసెంబర్ 30న మంత్రివర్గ విస్తరణ జరిగింది. కొత్తగా 36 మందిని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఎన్సీపీ నుంచి 14 మంది, కాంగ్రెస్ నుంచి 10 మంది, శివసేన నుంచి 12 మంది మంత్రి పదవులు పొందారు. వీరితో విధాన భవన్ ప్రాంగణంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ విస్తరణ అనంతరం ముఖ్యమంత్రితో కలుపుకుని, మొత్తం మంత్రుల సంఖ్య 43కి చేరింది. 15 శాతం నిబంధన మేరకు.. 288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర మంత్రివర్గ సంఖ్య 43కి మించకూడదు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
ఎప్పుడు : డిసెంబర్ 30
ఎవరు : ఎన్సీపీ సీనియర్ నేత అజిత్‌పవార్
ఎక్కడ : విధాన భవన్, మహారాష్ట్ర
Published date : 31 Dec 2019 05:30PM

Photo Stories