Skip to main content

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ రాజీనామా

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Current Affairsమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ నవంబర్ 26న తమ పదవులకు రాజీనామా చేశారు. నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్‌తో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు. అయితే నవంబర్ 27న ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఫడ్నవీస్, అజిత్ పవార్ రాజీనామా చేశారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేం. అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా’ అని దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.

ఫడ్నవీస్ ప్రమాణం, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
 
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా
ఎప్పుడు : నవంబర్‌ 26
ఎవరు : దేవేంద్ర ఫడ్నవీస్
ఎందుకు : ఫడ్నవిస్‌ ప్రభుత్వం బలపరీక్షను ఎదర్కొవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో
Published date : 26 Nov 2019 04:12PM

Photo Stories