మహాబలిపురంలో జిన్‌పింగ్ -మోదీ భేటీ
Sakshi Education
మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ అక్టోబర్ 11,12వ తేదీల్లో జరిగింది.
చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. అలాగే.. సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు.
రెండో రోజు (అక్టోబర్ 12న) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరిగాయి. ఈ సదస్సులో భాగంలో మొత్తం ఆరు గంటల పాటు ఇరునేతలు ముఖాముఖి భేటీ అయ్యారు. భారత్-చైనా మధ్య సహకారం, పర్యాటక, వాణిజ్యం తదితర అంశాలపై మోదీ, జిన్‌పింగ్‌కుచర్చించుకున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై సరికొత్త విధానంలో చర్చలు జరపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ఈ చర్చల్లో భారత్ నుంచి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, చైనా నుంచి వైస్ ప్రీమియర్ హు చుంగ్ హావా పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ
ఎప్పుడు: అక్టోబర్ 11,12వ తేదీల్లో
ఎవరు: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎందుకు: భారత్-చైనా మధ్య సహకారం, పర్యాటక, వాణిజ్యం తదితర అంశాలపై
ఎక్కడ: మహాబలిపురం

Published date : 12 Oct 2019 04:29PM