Skip to main content

మెస్సీకి ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు

అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ ప్రతిష్టాత్మక ఫిఫా ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు.
అలాగే ఫిఫా ‘మహిళల ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మెగన్ రెపినో (అమెరికా) ఎంపికైంది. ఇటలీలోని మిలాన్‌లో సెప్టెంబర్ 25న జరిగిన కార్యక్రమంలో మెస్సీ, రెపినోకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. మెస్సీ చాంపియన్స్ లీగ్‌లో 12 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే బార్సిలోనా లా లిగా టైటిల్ నెగ్గడంలో కూడా కీలకపాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 36 గోల్స్ చేయడంతో మెస్సీకి ‘యూరోపియన్ గోల్డెన్ షూ’ లభించింది. దీంతో అవార్డు రేసులో పలువురు స్టార్ స్ట్రయికర్లు పోటీ ఇచ్చినా... మెస్సీనే విజేతగా నిలిచాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఫిఫా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : లియోనల్ మెస్సీ
ఎక్కడ : మిలాన్, ఇటలీ
Published date : 25 Sep 2019 05:39PM

Photo Stories