మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం విజ్ఞాన సాగర్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
Sakshi Education
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 14న కేరళ రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు.
కొచ్చిలో రూ. 6 వేల కోట్ల విలువైన బీపీసీఎల్‌కు చెందిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను జాతికి అంకితం చేశారు. అలాగే కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌ను, మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ‘విజ్ఞాన సాగర్’ను ప్రారంభించారు. మరోవైపు బోల్‌గట్టి, విలింగ్డన్ ఐలండ్ మధ్య జల మార్గ రవాణా కోసం రెండు నౌకలను ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం విజ్ఞాన సాగర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొచ్చి, కేరళ
ఎందుకు : మెరైన్ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెరైన్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం విజ్ఞాన సాగర్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : కొచ్చి, కేరళ
ఎందుకు : మెరైన్ ఇంజినీరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు
Published date : 15 Feb 2021 05:56PM