మెక్సికో గ్రాండ్‌ప్రి విజేతగా హామిల్టన్
Sakshi Education
మెక్సికో గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్(బ్రిటన్) విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసులో హామిల్టన్ గంటా 36 నిమిషాల 48.904 సెకన్లలో గమ్యానికి చేరి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. మరో మూడు రేసులు మిగిలి ఉన్న 2019 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్‌లో ప్రస్తుతం హామిల్టన్ 363 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు.
టైగర్ వుడ్స్ రికార్డు విజయం
గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అద్భుత కెరీర్‌లో మరో కొత్త ఘనత చేరింది. జపాన్‌లోని ఇన్‌జాయ్‌లో జరిగిన జోజో చాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్ వుడ్స్ యూఎస్ పీజీఏ టూర్ టైటిల్స్ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్ స్నీడ్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును వుడ్స్ సమం చేశాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెక్సికో గ్రాండ్‌ప్రి విజేత
ఎప్పుడు : అక్టోబర్ 28
ఎవరు : మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్

Published date : 29 Oct 2019 06:13PM