Skip to main content

మేఘాలయ గవర్నర్‌గా సత్యపాల్‌ మాలిక్‌

గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది.
Current Affairs
ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ ఆగస్టు 18న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మహారాష్ట్ర గవర్నరు భగత్ సింగ్ కోశ్యారికి గోవా బాధ్యతలను అదనంగా అప్పగించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా గోవా గవర్నర్‌గా కూడా కోష్యారీ అదనపు బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి భవన్ ఆదేశించింది. మేఘాలయ గవర్నర్‌గా ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకున్న తథాగతరాయ్ స్థానంలో సత్యపాల్ మాలిక్ ను రాష్ట్రపతి బదిలీ చేశారు. గతంలో జమ్ముకశ్మీర్, బిహార్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ పని చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : మేఘాలయ గవర్నర్‌గా బదిలీ
ఎప్పుడు : ఆగస్టు 18
ఎవరు : గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌
Published date : 18 Aug 2020 04:58PM

Photo Stories