Skip to main content

మే 15 నాటికి 38,220 మరణాలు?

దేశంలో కరోనా బాధితుల మరణాలు, కేసులు భారీగా పెరగనున్నాయా అనే ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి ప్రముఖ సంస్థలు.
Current Affairs

మే 15వ తేదీ నాటి కల్లా కరోనా వైరస్‌తో మరణించే వారి సంఖ్య 38,220కు చేరుకుంటుందని, మొత్తం కేసులు 30 లక్షలకు చేరుకోనుందని ఇవి అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయని లెక్కలు తేల్చాయి. ఇప్పటి వరకు ఇటలీ, న్యూయార్క్‌ల్లో కరోనా మరణాలు, కేసులపై వేసిన అంచనాలు దాదాపు నిజమయ్యాయని తెలిపాయి. జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చి, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(బెంగళూరు), ఐఐటీ బోంబే, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీ(పుణె)ఈ మేరకు ‘కోవిడ్‌–19 మెడ్‌ ఇన్వెంటరీ’ పేరుతో ఈ అంచనాలు రూపొందించాయి.


ప్లాస్మా థెరపీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి

రాష్ట్రంలో ప్లాస్మాథెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేం దుకు కేంద్రం అనుమతిచ్చిందని తెలంగాణ‌ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఏప్రిల్ 24న‌ వెల్లడించారు. 4రోజుల కింద ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అను మతినివ్వాలని కేంద్రాన్ని కోరగా, తాజాగా అనుమతి వచ్చిందని పేర్కొన్నారు. కరోనా పాజిటివ్‌ రోగుల్లో బాగా సీరియస్‌గా ఉన్నవారికి ఈ విధానం ద్వారా చికిత్స చేస్తామన్నారు.

Published date : 25 Apr 2020 07:17PM

Photo Stories