మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ కన్నుమూత
Sakshi Education
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత బాబులాల్ గౌర్(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆగస్టు 21న గుండెపోటు రావడంతో భోపాల్‌లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్‌లో 1930, జూన్ 2న జన్మించిన బాబులాల్ కార్మిక సంఘాల నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. జనతా పార్టీ సహకారంతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీలో చేరారు. గోవింద్‌పురా నుంచి 10సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2005 వరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : బాబులాల్ గౌర్(89)
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఎందుకు : గుండెపోటు రావడంతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : బాబులాల్ గౌర్(89)
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఎందుకు : గుండెపోటు రావడంతో
Published date : 21 Aug 2019 06:20PM