మధ్యాహ్న భోజనం ఆహారంపై జీఎస్టీ మినహాయింపు
Sakshi Education
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంతోపాటు, అంగన్‌వాడీలు, ప్రీ–స్కూల్‌లకు సరఫరా అయ్యే ఆహారంపై జీఎస్టీ(వస్తుసేవల పన్ను)నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డ్(సీబీఐసీ) తెలిపింది.
టీకాతో ఆస్పత్రిలో చేరే అవకాశం 80 శాతం తక్కువ!
వ్యాక్సినేషన్‌తో కరోనా వైరస్ తీవ్రత భారీగా తగ్గిపోతుందని కేంద్ర ప్రభుత్వం జూన్ 18న వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినప్పటికీ ఆసుపత్రిలో చేరే అవకాశాలు 75–80 శాతం తగ్గుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిందని గుర్తుచేసింది. అలాగే ఆక్సిజన్ అవసరం కూడా 8 శాతం తగ్గిపోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
మే 28వ తేదీన జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై ఈ మేరకు జూన్ 17వ తేదీన స్పష్టతనిచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం సహా విద్యాసంస్థల్లో చేపట్టే అన్ని కేటరింగ్ సర్వీసులపైనా జీఎస్టీని మినహాయిస్తున్నట్లు తెలిపింది.
టీకాతో ఆస్పత్రిలో చేరే అవకాశం 80 శాతం తక్కువ!
వ్యాక్సినేషన్‌తో కరోనా వైరస్ తీవ్రత భారీగా తగ్గిపోతుందని కేంద్ర ప్రభుత్వం జూన్ 18న వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా సోకినప్పటికీ ఆసుపత్రిలో చేరే అవకాశాలు 75–80 శాతం తగ్గుతున్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలిందని గుర్తుచేసింది. అలాగే ఆక్సిజన్ అవసరం కూడా 8 శాతం తగ్గిపోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని తెలిపింది.
Published date : 19 Jun 2021 06:39PM