మావోయిస్టుల దాడిలో ఎమ్మేల్యే మృతి
Sakshi Education
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా శ్యామలగిరిలోని ‘నకుల్‌నార్’ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన దాడిలో దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి(40) మృతి చెందారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాండవికి చెందిన కాన్వాయ్ లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతోపాటు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే మాండవితో పాటు నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మావోయిస్టుల దాడిలో ఎమ్మేల్యే మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భీమా మాండవి(40)
ఎక్కడ : నకుల్‌నార్ ప్రాంతం , శ్యామలగిరి, దంతెవాడ జిల్లా, ఛత్తీస్‌గఢ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : మావోయిస్టుల దాడిలో ఎమ్మేల్యే మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : భీమా మాండవి(40)
ఎక్కడ : నకుల్‌నార్ ప్రాంతం , శ్యామలగిరి, దంతెవాడ జిల్లా, ఛత్తీస్‌గఢ్
Published date : 10 Apr 2019 04:37PM