మాతృ వందన సప్త్‌లో ఏపీకి మొదటి ర్యాంకు
Sakshi Education
ప్రధానమంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో భాగంగా 2019 డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన ‘మాతృ వందన సప్త్’లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకు లభించింది.
అలాగే పీఎంఎంవీవై ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2వ ర్యాంకును ఏపీ సాధించింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా జిల్లాల వారీ ప్రతిభలో కర్నూలుకు 2వ ర్యాంకు దక్కింది. కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ జనవరి 28న ప్రకటించిన ‘పీఎంఎంవీవై’ ర్యాంకుల్లో ఈ విషయం వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులకు వెళుతూ సక్రమంగా వైద్య పరీక్షలకు రాని గర్భిణులను ఆస్పత్రులకు వచ్చేలా ప్రోత్సహించడంలో భాగంగా పీఎంఎంవీవైను ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు మాతృ వందన సప్త్‌లో మొదటి ర్యాంకు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : మాతృ వందన సప్త్ అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు మాతృ వందన సప్త్‌లో మొదటి ర్యాంకు
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : కేంద్ర స్త్రీ శిశు సంక్షేమశాఖ
ఎక్కడ : దేశంలో
ఎందుకు : మాతృ వందన సప్త్ అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు
Published date : 29 Jan 2020 06:05PM