మాస్క్ దరించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రం?
మాస్క్‌లపై చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రంగా రాజస్తాన్ నిలువనుందని తెలిపారు. మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో అక్టోబర్ 31న బిల్లుని ప్రవేశపెట్టారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బిల్లులు...
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజస్తాన్ అసెంబ్లీ నవంబర్ 2న మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఈ విధమైన బిల్లులను రూపొందించాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు, లేదా అంతకన్నా ఎక్కువకు రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయాలని రాజస్తాన్ ప్రభుత్వం బిల్లుల్లో పేర్కొంది. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.
చదవండి: కేంద్ర తెచ్చిన మూడు వ్యవసాయ రంగ బిల్లులు, వివరాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మాస్క్ దరించడం తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురాబోతోన్న తొలి రాష్ట్రం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : రాజస్తాన్
ఎందుకు : కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి