మారుతీ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ కన్నుమూత
Sakshi Education
ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ (79) కన్నుమూశారు.
గుండెపోటు కారణంగా ఏప్రిల్ 26న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. మాజీ బ్యూరోక్రాట్ అయిన ఖట్టర్‌కుదేశీ ఆటోమోటివ్ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 1993లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా (మార్కెటింగ్ విభాగం) చేరిన ఖట్టర్... 2002లో మారుతీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. 2007లో రిటైరయ్యారు. రిటైర్ అయిన తర్వాత కార్‌నేషన్ ఆటో పేరుతో మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ చెయిన్‌నుఖట్టర్ ప్రారంభించారు. అయితే, ఈ ప్రయోగంలో ఆయన అంతగా విజయం సాధించలేకపోయారు.
మానవతామూర్తి డాక్టర్ బేరమ్మకన్నుమూత
నెల్లూరు జిల్లా వాసులకు 4 దశాబ్దాల పాటు విశిష్ట సేవలందించిన అమెరికాకు చెందిన బాప్టిస్ట్ మిషనరీ డాక్టర్ బేరమ్మ (94) (డాక్టర్ మెరియన్ బొహెర్) అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లో ఏప్రిల్ 26న కన్నుమూశారు. 1951 నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు రైల్వే ఫీడర్స్ రోడ్డులోని నెల్లూరు అమెరికన్ బాప్టిస్టు క్రిస్టియన్ హాస్పిటల్ (బీసీ హాస్పిటల్) వైద్యురాలిగా బేరమ్మ పనిచేశారు. ఆ సమయంలో సుమారు 40 వేల శస్త్ర చికిత్సలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి :ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా మాజీ ఎండీకన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : జగదీష్ ఖట్టర్ (79)
ఎక్కడ :న్యూఢిల్లీ
ఎందుకు:గుండెపోటు కారణంగా...

Published date : 28 Apr 2021 11:55AM