మార్స్ ఉపరితలంపై టెస్ట్ డ్రైవ్ చేసిన రోవర్?
Sakshi Education
మార్స్పై పరిశోధనల నిమిత్తం (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) నాసా పంపిన ‘‘పర్సెవరెన్స్’’ రోవర్ తాజాగా అంగారక ఉపరితలంపై టెస్ట్ డ్రైవ్ విజయవంతంగా పూర్తి చేసింది.
అంగారకునిపై పరిశోధనలు ప్రారంభించే ముందు ఈ రోవర్ 6.5 మీటర్ల మేర ప్రయాణం చేసిందని మార్చి 6న నాసా తెలిపింది. ఇందుకు సుమారు 33 నిమిషాలు పట్టిందని పేర్కొంది.
200 మీటర్ల దూరాలను...
మార్స్‌పై పరిశోధనల్లో భాగంగా పర్సెవరెన్స్ రోవర్ 200 మీటర్ల దూరాలను కవర్ చేయాల్సి ఉంటుంది. 2021, ఫిబ్రవరి 18న ఈ రోవర్ మార్స్‌పై లాండ్ అయింది. కుజుడిపై రాళ్లు, మట్టిని పరిశోధించడం, సూక్ష్మజీవుల ఉనికిని అన్వేషించడం, మనిషి లాండ్ అయ్యే అవకాశాలను పరిశీలించడం దీని విధులు.
చదవండి: పర్సెవరెన్స్ రోవర్‌ను ఏ రాకెట్ ద్వారా మార్స్‌పైకి పంపించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పర్సెవరెన్స్ రోవర్ టెస్ట్‌డ్రైవ్ విజయవంతం
ఎప్పుడు : మార్చి 6
ఎవరు : నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా)
ఎక్కడ : అంగారక గ్రహం
ఎందుకు : అంగారక గ్రహంపై పరిశోధనలు చేసేందుకు

Published date : 08 Mar 2021 05:54PM