మార్కెట్‌లో పర్యావరణహిత టపాసులు
Sakshi Education
సాధారణ టపాసుల కంటే 30 శాతం తక్కువ ఉద్గారాలను వెలువరించే పర్యావరణహిత టపాసులు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ అక్టోబర్ 5న ప్రకటించారు.
ప్రజల మనోభావాలను పరిగణనలో ఉంచుకొని పర్యావరణానికి హాని కలిగించని టపాసులను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పర్యావరణహిత టపాసులను శాస్త్రీయ పరిశ్రమల పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్) తయారు చేసింది. 2018లో దీపావళి పండుగను పర్యావరణహిత టపాసులతోనే జరపాలని సూచిస్తూ కాలుష్యాన్ని కలిగించే టపాసుల తయారీ పరిశ్రమలను మూసేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మార్కెట్‌లో పర్యావరణహిత టపాసులు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
ఎందుకు : పర్యావరణానికి హాని తగ్గించేందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : మార్కెట్‌లో పర్యావరణహిత టపాసులు
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
ఎందుకు : పర్యావరణానికి హాని తగ్గించేందుకు
Published date : 07 Oct 2019 06:59PM