Skip to main content

మారిషస్ కోర్టు భవన ప్రారంభోత్సవంలో మోదీ

మారిషస్ రాజధాని పోర్ట్ లూయీస్‌లో నిర్మించిన మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనాన్ని జూలై 30న మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌తో కలిసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు.
Current Affairs
అనంతరం మోదీ మాట్లాడుతూ... ఇతర దేశాలతో భారత దేశ ప్రగతికాముక సంబంధాలు విశ్వ మానవాళి సంక్షేమం లక్ష్యంగా కొనసాగేవని స్పష్టం చేశారు. భారత్, మారిషస్ దేశాల మధ్య సహకారానికి ఈ భవనం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.

భారత్ భాగస్వామ్యం...
అఫ్గానిస్తాన్ పార్లమెంట్ భవన నిర్మాణంలో, నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంలో, నేపాల్‌లో ఎమర్జెన్సీ అండ్ ట్రామా సెంటర్ ఏర్పాటులో, శ్రీలంకకు ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్‌ల రూపకల్పనలో, మాల్దీవుల్లో క్రికెట్ క్రీడ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం భారతీయులందరికీ గర్వకారణమని మోదీ తెలిపారు. సుప్రీంకోర్టు భవన నిర్మాణంలో భారత్ అందించిన సహకారానికి మారిషస్ ప్రధాని జగన్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : మారిషస్ సుప్రీంకోర్టు నూతన భవనం ప్రారంభం
ఎప్పుడు : జూలై 30
ఎవరు : భారత ప్రధాని మోదీ, మారిషస్ ప్రధాని జగన్నాథ్
ఎక్కడ : పోర్ట్ లూయీస్, మారిషస్
Published date : 01 Aug 2020 12:02PM

Photo Stories