Skip to main content

మార్చి 5న జీఐ శాట్-1 ప్రయోగం

దేశ భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్-1)ను 2020, మార్చి 5వ తేదీన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించనుంది.
Current Affairsశ్రీహరికోటలోని షార్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 (జీఎస్‌ఎల్‌వీ మార్క్-2) రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిస్తారు. 2,100 కిలోల బరువైన జీఐ శాట్-1ను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని జియో ఆర్బిట్ (భూ స్థిర కక్ష్య)లోకి ప్రవేశపెడతారు. అదేవిధంగా 2020, మార్చి 10న పీస్‌ఎల్‌వీ సీ-49 ద్వారా రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (రిశాట్)ను ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020, మార్చి 5వ తేదీన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐ శాట్-1) ప్రయోగం
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)
ఎక్కడ : షార్, శ్రీహరికోట, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : దేశ భద్రత, అవసరాల కోసం
Published date : 24 Feb 2020 06:12PM

Photo Stories