Skip to main content

మార్చి 22న జనతా కర్ఫ్యూ: ప్రధాని మోదీ

కరోనా వైరస్ ముప్పు దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 19న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Current Affairsకరోనాపై పోరులో భాగంగా.. మార్చి 22న(ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ ప్రజలంతా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రజల కోసం, ప్రజలే స్వచ్ఛందంగా విధించుకునే ఈ జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ఆ రోజు ప్రజలు పూర్తి సమయం తమ ఇంట్లోనే ఉండాలని, ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టకూడదని సూచించారు. ఈ జనతా కర్ఫ్యూ కరోనాపై పోరులో దేశ ప్రజల నిబద్ధతకు తార్కాణంగా నిలుస్తుందన్నారు.

కనీవినీ ఎరుగని ఉత్పాతం
‘‘ఇది మామూలు ఉత్పాతం కాదు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు కూడా ఈ స్థాయిలో ప్రపంచ దేశాలపై ప్రభావం చూపలేదు. ప్రపంచం ఇప్పుడు కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్-19కి కచ్చితమైన చికిత్స కానీ టీకా కానీ లేదు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు దేశ ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
2020, మార్చి 22న జనతా కర్ఫ్యూ
ఎప్పుడు : మార్చి 19
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : దేశవ్యాప్తంగా
ఎందుకు : కరోనాపై పోరులో భాగంగా
Published date : 20 Mar 2020 05:53PM

Photo Stories